ఏలూరు ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ.. టీడీపీ సైకిల్ యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ఎంపీ మాగంటి బాబు కూడా పాల్గొన్నారు.

సైకిల్ యాత్రలో భాగంగా సైకిల్ తొక్కుతూ.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు గుండె నొప్పి వచ్చింది. దీంతో స్పందించిన పార్టీ నేతలు హుటా హుటున ఆయనను ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.