విజయవాడ: టెక్నాలజీ సాయంతో విటులను ఆకర్షించి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది.  సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల ఫోటోలను ఎరగా వేసి విటులను ఆకర్షిస్తున్న ముఠా ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. ఎలాగో ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఈ వ్యభిచార మఠా గుట్టును రట్టు చేశారు. 

విజయవాడ పోలీసులు ఇటీవల నగరంలో వ్యభిచార గృహాల నిర్వహణపై ఉక్కుపాదం మోపడంతో ఓ ముఠా తమ మకాంను అవనిగడ్డకు మార్చింది. అక్కడ పోలీసులకు అనుమానం రాకుండా వుండేందుకు బ్యూటీ పార్లర్ ను ఓపెన్ దాని ఆ ముసుగులో వ్యభిచారాన్ని సాగిస్తున్నారు. 

read more  పోర్న్ సినిమా ట్రైలర్‌లా.. మొత్తం నగ్నమే!

ఈ క్రమంలో విటులను ఆకర్షించేందుకు హైటెక్ పద్దతులను ఉపయోగిస్తోంది ఈ ముఠా. ఫోన్‌లో అమ్మాయిల ఫోటోలు పంపి వారికి నచ్చిన అమ్మాయిలను బుక్ చేసుకున్నాక బ్యూటీ పార్లర్ కు పిలిచేవారు. ఇలా ఎవ్వరికీ అనుమానం రాకుండా గతకొంత కాలంగా ఈ దందా సాగుతోంది. 

అయితే ఈ వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న అవనిగడ్డ పోలీసులు బ్యూటీ పార్లర్ పై దాడి చేశారు. ఇందులో విజయవాడకు చెందిన ముగ్గురు విటులతో పాటు ఐదుగురు నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.