ఇలాంటి కష్టం ఏ బిడ్డకూ రాకూడదు.. దాచేపల్లి బాధితురాలి తల్లి

Dachepalle victim's mother expresses her feeling
Highlights

కన్నీరు పెట్టుకున్న బాధితురాలి తల్లి

దాచేపల్లి ఘటన యావత్ రాష్ట్ర ప్రజలను కలిచివేసింది. అభం శుభం తెలియని 9ఏళ్ల  చిన్నారిపై 53ఏళ్ల మృగం లాంటి మగాడు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారి పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. ఆ కామాంధుడు చేసిన పని.. చిన్నారి మనసుపై పాతుకుపోయింది. ఆస్పత్రిలో డాక్టర్ ని చూసినా బాలిక గజ గజ వణికిపోతోంది. 

బాలిక పడుతున్న మనోవేదనను ఆమె తల్లి వివరించారు. తన బిడ్డ పడుతున్న బాధను చూసి ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.  ఇలాంటి కష్టం మరే బిడ్డకు రాకూడదని వేడుకున్నారు. నిందితుడిని పోలీసులు తమకు అప్పగించాలని కోరారు. నిందితుడికి అసలైన శిక్ష తామే వేస్తామని చెప్పారు. అతి కిరాతకంగా శిక్షించాలన్నారు. తాతా.. తాత అని పిలిచే చిన్న పాపను ఇలా చేయాలని ఎలా అనిపించందంటూ బాధితురాలి తల్లి ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా కొద్ది సేపటి క్రితమే నిందితుడు రామసుబ్బయ్య గురజాల మండల దైద దగ్గర చెట్టుకి ఉరివేసుకొని చనిపోయి కనిపించాడు.

loader