Asianet News TeluguAsianet News Telugu

ప్రస్తుతం యానంలో తుఫాను పరిస్థితి (వీడియో)

పెథాయ్ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలోపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా యానాంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. 

పెథాయ్ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలోపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా యానాంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే  అధికారులు.. అప్రమత్తమై తగు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవలు ప్రకటించారు.

భారీ వర్షాలకు చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా చాలా ప్రాంతాల్లో నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. మరోవైపు తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు పుదుచ్చేరి నుంచి ఇద్దరు ఐఏఎస్ అధికారులు యానాంకు వచ్చారు. కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరిస్థిని సమీక్షిస్తున్నారు.