దీక్ష విరమించిన సీఎం రమేశ్.. చంద్రబాబు ఏం చెప్పారు..?

cm ramesh deeksha viramana
Highlights

దీక్ష విరమించిన సీఎం రమేశ్.. చంద్రబాబు ఏం చెప్పారు..?

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ గత 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఎట్టకేలకు తన దీక్ష విరమించారు. ఉదయం ఆయన్ను పరామర్శించేందుకు కడప వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో తాను మాట్లాడుతానని.. కమిటీ వేసి సంప్రదింపులు చేస్తానని.. నిరంతరాయంగా పోరాటం చేద్దామని తక్షణం దీక్ష విరమించాలని రమేశ్‌ను కోరారు.. సీఎం విజ్ఞప్తికి  సానుకూలంగా స్పందించిన సీఎం రమేశ్ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చి రమేశ్‌తో దీక్ష విరమింపజేశారు. 
 

loader