సీఎం రమేశ్‌ను పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్యంపై ఆరా..?

First Published 30, Jun 2018, 1:05 PM IST
cm chandrababu naidu meets mp cm ramesh
Highlights

సీఎం రమేశ్‌ను పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్యంపై ఆరా..?

కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ చేస్తున్న దీక్ష పదకొండవ రోజుకి చేరింది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో పలువురు రమేశ్‌ని పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కడపకు చేరుకుని సీఎం రమేశ్‌ను పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.. బీపీ, షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందించాలని వైద్యులు చంద్రబాబుకు తెలిపారు. అనంతరం సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా రమేశ్‌ను పరామర్శించారు.

loader