అనంతపురం: ఓ డిగ్రీ విద్యార్థిని అదృశ్యం కేసులో తొమ్మిది నెలల తర్వాత పోలీసులకు క్లూ దొరికింది. శ్రావణి అనే డిగ్రీ విద్యార్థిని తొమ్మిది నెలల క్రితం తప్పిపోయింది. తమకు లభ్యమైన మానవ అవశేషాలు, సెల్ ఫోన్ ఆమెవే కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కదిర మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శ్రావణి నిరుడు అక్టోబర్ లో అదృశ్యమైంది. కళాశాలకు వెళ్లిన ఆణె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలించి, చివరకు కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశఆరు మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ఈ నెల 22వ తేదీన కదిరి మున్సిపల్ పరిధిలో గల సోమేష్ నగర్ వద్ద శ్రావణికి సంబంధించిన ఆధారాలను ఓ గొర్రెల కాపరి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డిఎస్పీ షేక్ లాల్ మహమ్మద్, సిఐ రామకృష్ణ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

పంట పొలాల్లో వారికి శ్రావణి ఐడి కార్డు, సెల్ ఫోన్, ఏటిఎం కార్డు, కొద్దిగా నగదు కనిపించాయి. పర్సు పడి ఉన్న స్థలానికి కొద్ది దూరంలో ఓ పుర్రె, రెండు ఎముకలు పోలీసులకు కనిపించాయి. ఇవి శ్రావణికి సంబందించినవే కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఆమెపై దుండగులు అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.