బ్రేకింగ్ న్యూస్ : అఖిలపక్ష సమావేశానికి నిర్ణయం

బ్రేకింగ్ న్యూస్ : అఖిలపక్ష సమావేశానికి నిర్ణయం

కేంద్రప్రభుత్వ తీరుపై మంగళవారం చంద్రబాబునాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతీ పార్టీ తరపున ఇద్దరు ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపనున్నది. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి, విభజన చట్టంలోని హామీల అమలు తదితరాలపై రేపు ఉదయం 11 గంటలకు అమరావతిలో కీలక సమావేశం జరుగనున్నది.

కేంద్రంపై వైసిపి, టిడిపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను కేంద్రం అడ్డుకుంటున్న తీరుపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వైసిపి సహా అన్నీ ప్రతిపక్షాలకు సిఎం కార్యాలయం ఆహ్వానాలను సిద్ధం చేసింది. ఇదే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని వైసిపి ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న చంద్రబాబు లెక్క చేయలేదు. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు తీరిగ్గా ఇపుడు అఖిలపక్ష సమావేశమని, వచ్చే నెలలో అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళాలని సిఎం నిర్ణయించంటం గమనార్హం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page