Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్ల చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసు: 24న తుది తీర్పు

ఆరేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు అదనపు జిల్లా   కోర్టు (ఫాస్ట్ ట్రాక్ కోర్టు)  ఈ నెల 24వ తేదీన తుది తీర్పును ఇవ్వనుంది. 
 

Chittoor Court final verdict todayn on six year old Varshitha rape and murder case
Author
Chittoor, First Published Feb 18, 2020, 12:11 PM IST


తిరుపతి: గత ఏడాది చిత్తూరు జిల్లాలో  ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై చిత్తూరు జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు  మంగళవారం నాడు తీర్పును వెలువర్చే అవకాశం ఉంది. ఈ కేసుపై వాస్తవానికి సోమవారం నాడే తీర్పును వెలువడాల్సి ఉంది.

అయితే  ఈ విషయమై నిందితుడు రఫీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పును మంగళవారం నాటికి వాయిదా వేసింది చిత్తూరు మెదటి  అదనపు జిల్లా కోర్టు (ఫాస్ట్ ట్రాక్ కోర్టు)  తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రఫీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు మంగళవారం నాడు  కోర్టు సమావేశమైంది. ఈ కేసుపై తుది తీర్పును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా కోర్టు ప్రకటించింది. 

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లోని ఒక కళ్యాణ మండపానికి తల్లిదండ్రులతో పెళ్లికి వెళ్లిన చిన్నారి వర్షిత అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ  ఘటన 2019 నవంబర్ ఏడో తేదీన చోటు చేసుకొంది. 

ఆ సమయంలో చిన్నారి వర్షితపై దాడికి పాల్పడిన నిందితుడిని సీసీటీవీ  పుటేజీ ఆధారంగా పోలీసులు. మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్యచేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  అదే ఏడాది నవంబర్ 16వ తేదీన నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మృతురాలి పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా, పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. హత్య జరిగిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకొన్న పోలీసులు.

డిసెంబర్ 30వ తేదీ నుండి  ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు కూడ పూర్తయ్యాయి.  ఈ కేసులో తుది తీర్పును ఈ నెల 17వ తేదీన ఇవ్వాల్సి ఉంది. 

అయితే చివరి నిమిషంలో నిందితుడు రపీ తన వాదనను మరోసారి విన్పించుకొనే అవకాశం కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో  రఫీ వాదనను కోర్టు వినే అవకాశం ఉంది. ఈ తరుణంలో  తుది తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

 బి. కొత్తకోట మండలం గట్టు పంచాయితీ గుట్టపాలెంకు చెందిన సిద్దారెడ్డి, ఉషారాణి దంపతుల కూతురు  వర్షిత, ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.  వైష్ణవి, వర్షిణి, వర్షిత.  2019 నవంబర్ 7న అంగల్లు సమీపంలోని చేనేత నగర్లో ఉన్న  కళ్యాణ మండపంలో బంధువుల పెళ్లి ఉండడంతో సిద్దారెడ్డి కుటుంబం ఈ పెళ్లికి హాజరైంది.

 కళ్యాణ మండపంలోనే ఆడుకొన్న వర్షిణి అదే రోజు రాత్రి 10 గంటలకు కన్పించకుండాపోయింది. చిన్నారి కోసం  కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.  చిన్నారి వర్షితను నిందితుడు రపీ కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

కళ్యాణ మండపానికి సమీపంలోనే నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారి వర్షిత  డెడ్‌బాడీ లభ్యమైంది.రపీ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. రపీ ప్రవర్తన సరిగా లేదని భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. ఓ కేసులో  రపీ రెండు మాసాలు జైలులో ఉండి వచ్చాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios