Asianet News TeluguAsianet News Telugu

బాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, చెప్పులతో వైసీపీ దాడి: విశాఖలో తీవ్ర ఉద్రిక్తత

విశాఖపట్టణంలో చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు దాడులకు దిగారు. గురువారం నాడు ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు విశాఖపట్టణం వచ్చారు. 

chandrababu praja chaitanya yatra:Tension prevails in Visakapatnam airport
Author
Visakhapatnam, First Published Feb 27, 2020, 12:21 PM IST


విశాఖపట్టణం: విశాఖపట్టణంలో చంద్రబాబు పర్యటనలో గురువారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబునాయుడు కాన్వాయ్‌పై కోడిగుడ్లతో వైసీపీ శ్రేణులు  కోడిగుడ్లతో దాడికి దిగారు. ఈ సమయంలోనే వైసీపీ శ్రేణులు దాడికి దిగారు.కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు.

Also read:చంద్రబాబు ర్యాలీకి పర్మిషన్ నో: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్  ఏర్పాటు చేస్తామని  ప్రభుత్వం ప్రకటించింది. మూడు రాజధానులను   టీడీపీ  వ్యతిరేకిస్తోంది. 

అయితే వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో  చైతన్యం తెచ్చేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా  ప్రజా చైతన్య యాత్రలను ప్రారంభించారు. ఈ యాత్రల్లో భాగంగానే చంద్రబాబునాయుడు గురువారం నాడు  విశాఖపట్టణానికి వచ్చారు.

Also read:చంద్రబాబు ర్యాలీకి పర్మిషన్ నో: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

చంద్రబాబునాయుడు విశాఖ పట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకొన్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణులు  కోడిగుడ్లు, టమాటలు విసిరారు. 

ఒకానొక దశలో వైసీపీ నేతలు బాబు కాన్వాయ్‌ వైపు చెప్పులు చూపించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటలు విసిరారు. ఈ సమయంలో  బాబు కాన్వాయ్‌కు రక్షణ కల్పిస్తున్  ఓ కానిస్టేబుల్‌పై కోడిగుడ్లు పడ్డాయి.

విశాఖ ఎయిర్‌పోర్టు ప్రాంగంణంలోనే  చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ నిలిచిపోయింది. నిరసనకారులను విమానాశ్రయం నుండి బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేశారు.  విశాఖలో రాజధానికి అనుకూలంగా  చంద్రబాబునాయుడు ప్రకటన చేసిన తర్వాతే ర్యాలీని కొనసాగించాలని వైసీపీ డిమాండ్ చేసింది.

విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును అడ్డుకొనేందుకు  వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వైసీపీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేకు మధ్య తోపులాట చోటు చేసుకొంది.  ఎమ్మెల్యే ఎయిర్‌పోర్టులోకి వెళ్లారు.

ఇదిలా ఉండగా  విశాఖ ఎయిర్‌పోర్టులో సుమారు 45 నిమిషాల పాటు కాన్వాయ్ నిలిచిపోయింది. వైసీపీకి చెందిన వెయ్యి మంది కార్యకర్తలు బాబు కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొన్నారు.  

నిరసనకారులను అడ్డు తొలగడంతో బాబు కాన్వాయ్  మెల్ల మెల్లగా ఎయిర్ పోర్టు నుండి  జాతీయ రహదారి వైపుకు వెళ్తోంది. బాబు నిర్ణీత షెడ్యూల్ కంటే గంటన్నర పాటు ఆలస్యంగా  ప్రయటన ప్రారంభమైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios