Asianet News TeluguAsianet News Telugu

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్: స్టేకు క్యాట్ నిరాకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధకారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై స్టేఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 

CAT adjourned IPS officer AB venkateswara rao case to feb 24
Author
Amaravathi, First Published Feb 14, 2020, 12:29 PM IST

అమరావతి:  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై విచారణను క్యాట్ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. దేశ ద్రోహానిికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఐపఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును  ఏపీ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు  ఈ నెల 13వ తేదీన క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం నాడు విచారణ జరిగింది.  సస్పెన్షన్‌ చట్ట విరుద్దమని ప్రకటించాలని  క్యాట్‌ను ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. 

Also read:రాజకీయ ఒత్తిళ్ల వల్లనే...: క్యాట్ ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వర రావు

సస్పెన్షన్‌పై స్టే విధించాలని   ఏబీ వెంకటేశ్వరరావు  క్యాట్‌ను కోరారు.  అయితే స్టే విధించేందుకు మాత్రం క్యాట్ అంగీకరించలేదు. ఈ కేసు విచారణను  ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 

ఏపీ ప్రభుత్వం తరపున దేశాయి ప్రకాష్ రెడ్డి ఈ పిటిషన్‌పై వాదించారు.  డీజీపీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేశారని  క్యాట్  ప్రశ్నించింది. 

ఈ విషయమై తమకు వారం రోజుల పాటు సమయం ఇవ్వాలని  ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది క్యాట్‌ను కోరారు. 2019 మే నెల నుండి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎందుకు జీతం ఇవ్వలేదో చెప్పాలని  క్యాట్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios