బీజేపీకి మరో షాక్.. టీడీపీలోకి కీలకనేత

bjp senior leader raghurama krishnama raju says  good bye to BJP
Highlights

పార్టీని వీడిన రఘురామ కృష్ణంరాజు

ఏపీలో బీజేపీకి రోజుకో షాక్ తగులుతోంది. ఇటీవల కొందరు ప్రముఖ నేతలు వైసీపీలో చేరగా.. మరో కీలక నేత ఇప్పుడు పార్టీని   వీడారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించారు.

ఈ సాయంత్రం పార్టీ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి రానున్న రఘురామ కృష్ణంరాజు సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాట సభ సందర్భంగా అక్కడి బీజేపీ నేత జయరాం.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీడీపీ నుంచి బీజేపీ లోకి మరిన్ని వలసలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader