Asianet News TeluguAsianet News Telugu

అమరావతి నుండి రాజధాని తరలింపు సాధ్యం కాదు: తేల్చేసిన కన్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి తరలించడం సాధ్యం కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

BJP AP state president Kanna Laxminarayana sensational comments on Amaravathi
Author
Amaravathi, First Published Jan 16, 2020, 4:50 PM IST

అమరావతి: అధికారంలో ఉన్నందున ఏది పడితే అది చేయాలనుకొంటే సాధ్యం కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

also read:: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్

గురువారం నాడు విజయవాడలో బీజేపీ ఏపీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని తరలింపు ఏకపక్షంగా చేయడం సాధ్యం కాదన్నారు. రాజకీయపార్టీల అభిప్రాయాలతో పాటుస్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను కూడ తీసుకోవాల్సిన అవసరం ఉందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

also read:బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్

Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నంద

విశాఖపట్టణానికి రాజధానిని తరలించాలనే నిర్ణయంపై  పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడ దిగుతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.ఏకపక్షంగా రాజధానిని తరలించాలని నిర్ణయం తీసుకొంటే  జగన్ భ్రమే అవుతోందని కన్నా లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు.

Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా

also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

2015 తర్వాత రాజధాని నిర్మాణంలో అనేక మంది పాల్గొన్న విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను, స్టేక్ హోల్డర్స్ నిర్ణయాలను కూడ పరిగణనలోకి తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తే పోరాటానికి సిద్దం కానున్నట్టుగా  కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.జగన్ ఏది అనుకొంటే అది చేయాలనుకోవడం సాధ్యమా అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలవరంతో పాటు ఇతర విషయాల్లో కూడ జగన్ అనుకొన్నట్టుగా నడిచిందా అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

అసెంబ్లీలో మెజారిటీ ఉన్నందున ఏది అనుకొంటే అది చేయాలనుకోవడం తప్పని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. జగన్ నియంతృత్వధోరణితో ఏది పడితే చేస్తామనుకొంటే భ్రమే అవుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన పద్దతి సాధ్యం కాదన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios