Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్: 70 కి.మీ నడిచివెళ్లి ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న బందరు యువతి

ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొనేందుకు ఓ యువతి 70 కి.మీ దూరం నడిచి వెళ్లింది. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా కూడ ఆ యువతి ప్రియుడిని చేరుకొని పెళ్లికూడ చేసుకొంది. 

Bhavani walks 70 km for marriage with lover in krishna district
Author
Machilipatnam, First Published Apr 9, 2020, 3:59 PM IST

మచిలీపట్టణం: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొనేందుకు ఓ యువతి 70 కి.మీ దూరం నడిచి వెళ్లింది. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా కూడ ఆ యువతి ప్రియుడిని చేరుకొని పెళ్లికూడ చేసుకొంది. తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకొంది.

కృష్ణా జిల్లా మచిలీపట్టణంలోని ఈడేపల్లికి చెందిన కళ్లెపల్లి సాయి పున్నయ్య, హనుమాన్ జంక్షన్ కు చెందిన 18 ఏళ్ల యువతి భవాని ప్రేమించుకొన్నారు.

Also read:మరోసారి ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఆందోళన: 36 మంది నిలిపివేత

వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇదే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. మచిలీపట్టణంలో ఉన్న తన ప్రియుడిని కలుసుకొనేందుకు ఆ యువతి హనుమాన్ జంక్షన్ నుండి కాలినడకన బయలుదేరింది. 70 కి.మీ దూరం ప్రియుడి కోసం నడిచింది. ప్రియుడి ఇంటికి చేరుకొంది. బుధవారం నాడు ప్రియుడు పున్నయ్యను ఆమె వివాహం చేసుకొంది.

ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఈ జంట వెంటనే చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. లాక్ డౌన్ నేపథ్యంలో మచిలీపట్టణానికి ఎలా చేరుకొన్నావని యువతిని ప్రశ్నించిన పోలీసులు షాక్ కు గురయ్యారు. 70 కి.మీ నడిచే వచ్చానని ఆ యువతి పోలీసులకు చెప్పింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios