Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థినికి ప్రేమ పాఠాలు: మోసం చేసిన టీచర్‌ అరెస్ట్

విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు  తాను పనిచేస్తున్న స్కూల్ విద్యార్థిని పెళ్లి చేసుకొన్నాడు.

Bhanuprakasham arrested for cheating a student in prakasham district
Author
Prakasam, First Published Sep 18, 2018, 3:00 PM IST

ఒంగోలు: విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు  తాను పనిచేస్తున్న స్కూల్ విద్యార్థిని పెళ్లి చేసుకొన్నాడు.  కొంతకాలం పాటు ఆమెతో కాపురం కూడ పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండానే పారిపోయాడు. దీంతో బాధితురాలి తల్తిదండ్రుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకొంది.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం చినరాయపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న  డి.భానుప్రకాశం సింగరాయకొండ మండలం పాకాలకు చెందిన ఓ బాలికకు  ప్రేమ పేరుతో వల విసిరాడు. ఆమెను నమ్మించాడు.  శారీరకంగా  లొంగదీసుకొన్నాడు.

ఆ తర్వాత ఆ బాలిక ఒత్తిడి తేవడంతో ఓ ప్రార్థనా మందిరంలో ఉంగరాలు మార్చుకొన్నారు.  కొద్ది రోజుల పాటు  ఆమెతోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కన్పించకుండా వెళ్లిపోయాడు. ఫోన్‌ కూడ స్విచ్చాఫ్ చేసి ఉంది.

దీంతో తల్లిదండ్రుల సహాయంతో బాధితురాలు  సింగరాయకొండ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు  భానుప్రకాశాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబం ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు కూడ ఫిర్యాదు చేసింది.ఈ విషయమై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్  ఎర్రగొండపాలెం ఎంఈఓను ఆదేశించారు.

ఈ వార్తలు చదవండి

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios