బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష.. అసలు కేసు ఏంటంటే ?
సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ (Bandla ganesh) ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఈ మేరకు తీర్పు (Bandla Ganesh sentenced to one year in jail) వెలువరించింది.
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఏపీలోని ఒంగోలు కోర్టు ఆయనకు ఈ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు అలాగే రూ.95 లక్షల ఫైన్ కూడా విధించింది. దీంతో పాటు ఈ కేసు ఫైల్ చేసిన పిటిషనర్ కు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది.
భర్తను స్టేషన్ లో బంధించి.. భార్యపై కానిస్టేబుల్ లైంగిక దాడి.. దాచేపల్లిలో ఘటన
అసలేం జరిగిందంటే ?
తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేశ్ ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య నుంచి 2019లో రూ.95 లక్షలను అప్పుగా తీసుకున్నారు. అయితే ఆయన కొన్ని రోజుల తరువాత మరణించారు. దీంతో జానకి రామయ్య తండ్రికి బండ్ల గణేష్ రూ.95 లక్షల అప్పును చెక్ రూపంలో చెల్లించారు. కానీ అది బౌన్స్ అయ్యింది. దీంతో ఆయన కోర్టుకు వెళ్లారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరినామా విధించింది.
200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలా ? ఇవి ఉంటే సరిపోతుంది..
కాగా.. బండ్ల గణేశ్ కు చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడటం ఇదే తొలిసారి కాదు. టెంపర్ సినిమా సమయంలో రచయిత వక్కంతం వంశీ దాఖలు చేసిన రూ.25 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 2017లో హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వెంటనే బండ్ల గణేశ్ బెయిల్ కు అప్లయ్ చేసుకున్నారు. దీంతో కండీషన్స్ తో కూడిన బెయిల్ లభించింది.
ప్రధాని మోడీ మళ్లీ పంజాబ్ కు వస్తే వదిలిపెట్టం - నిరసనల్లో రైతు ఓపెన్ వార్నింగ్.. వీడియో వైరల్
ఇదిలా ఉండగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరు అమ్మాయిలతో, టెంపర్ వంటి సంచలన చిత్రాలను నిర్మించారు.