Asianet News TeluguAsianet News Telugu

AP Assembly : స్పీకర్ కు ఉల్లిగిఫ్ట్ ప్యాక్ అందించిన టీడీపీ ఎమ్మెల్యే

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు షాక్ ఇచ్చారు.స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉల్లిపాయల గిఫ్ట్ ప్యాక్ ఇచ్చిన ఇచ్చారు. ఉల్లిధరల నియంత్రణకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. 

Ap winter assembly sessions: TDP Mla Jogeswararao gives onions gift pack to speaker tammineni seetaram
Author
Amaravathi, First Published Dec 9, 2019, 12:39 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లిఘాటు రగడ సృష్టిస్తోంది. ఉల్లి ధరలపై వాయితా తీర్మానాన్ని అమోదించాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంపైను డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. 

ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే అందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ససేమిరా అన్నారు. మహిళల భద్రతకు సంబంధించి కీలక బిల్లుపై చర్చ జరుగుతుందని అందుకు సహకరించాలని కోరారు. 

ఇంతలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు షాక్ ఇచ్చారు.స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉల్లిపాయల గిఫ్ట్ ప్యాక్ ఇచ్చిన ఇచ్చారు. ఉల్లిధరల నియంత్రణకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. 

ఉల్లిధరలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న రాద్ధాంతంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 

ఉల్లికొనుగోలుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతుబజార్ లోకిలో ఉల్లిపాయలను రూ.25కు అందిస్తుంటే చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ లో మాత్రం కిలో రూ.200కు అమ్ముతున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్ లో రూ.25కు అమ్మగలరా అంటూ నిలదీశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.  
  అసెంబ్లీలో ఉల్లిపై జగన్ : రైతుబజార్ లో కిలో రూ.25 కానీ చంద్రబాబు హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ.200

Follow Us:
Download App:
  • android
  • ios