Asianet News TeluguAsianet News Telugu

అందుకే చెప్పులు పడ్డాయి: బాబుపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి

ap telugu academy chairperson nandamuri lakshmi parvathi fires on tdp chief chandrababu naidu
Author
Amaravathi, First Published Feb 28, 2020, 3:10 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె ఉత్తరాంధ్ర, రాయలసీమకు బాబు అన్యాయం చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.

టీడీపీ అధినేత డైరెక్షన్‌లోనే ఎంపీ నందిగం సురేశ్‌పై దాడి చేశారని ఆమె మండిపడ్డారు. రాజధాని రైతులను మోసం చేసింది చంద్రబాబేనని, అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు న్యాయం చేస్తున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు.

Also Read:జగన్ ను ఏ చట్టం కింద వెనక్కి పంపావు: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి

విశాఖపట్నంపై తన అనుకూల ఎల్లోమీడియాతో చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేయించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌ను టీడీపీ అధినేత అడ్డుకున్నారని.. అందుకే ఈ ప్రాంత ప్రజలు ఆయన పర్యటనను అడ్డుకున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని, స్వార్థపరుడని పిల్లనిచ్చి పెళ్లి చేసిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గురువారం విశాఖపట్నం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ సాయంత్రం వరకు హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే.

Also Read:రాజకీయాల నుండి తప్పుకొంటా, నిరూపిస్తారా: బాబుకు మంత్రి అవంతి సవాల్

చివరికి భద్రతా కారణాల రీత్యా చంద్రబాబును అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. చర్చల అనంతరం ఆయనను రాత్రికి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios