Asianet News TeluguAsianet News Telugu

మండలి ఛైర్మన్ స్పీచ్ ఇదే, అందరూ చూడాలి: అసెంబ్లీలో జగన్

బిల్లు మూవ్ చేసిన 12 గంటలలోపే దానికి సంబంధించిన సవరణలు కూడా ఇవ్వాలని మండలి ఛైర్మన్ చెప్పారని జగన్ గుర్తుచేశారు. బుధవారం రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ చేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలోని స్క్రీన్‌పై ప్రదర్శించారు.

ap legislative council chairman speech on AP capitals decentralization bill sent to select committee
Author
Amaravathi, First Published Jan 23, 2020, 6:01 PM IST

బిల్లు మూవ్ చేసిన 12 గంటలలోపే దానికి సంబంధించిన సవరణలు కూడా ఇవ్వాలని మండలి ఛైర్మన్ చెప్పారని జగన్ గుర్తుచేశారు. బుధవారం రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ చేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలోని స్క్రీన్‌పై ప్రదర్శించారు.

సెలక్ట్ కమిటీకి పంపాలన్న ఆలోచన వచ్చినప్పుడు, బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే మూవ్ చేయాలి, ఆ టైమ్ లాప్స్ అయ్యిందన్నారు. ప్రభుత్వపరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి.. రూల్ పరంగా ప్రైవేట్ ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకోవడానికి విల్లేదని మంత్రులు వాదించిన విషయం కూడా నిజమే.. ప్రభుత్వ వాదనతోనే ఇటు బీజేపీ, అటు పీడీఎఫ్, లెఫ్ట్ కూడా ఏకీభవించాయని ఛైర్మన్ చెప్పారు.

Also Read:5 కోట్ల మంది నమ్మకాన్ని వమ్ము చేశారు: మండలిలో పరిణామాలపై జగన్ ఆవేదన

అలాగే సెలక్ట్ కమిటీ వేయాలన్న తెలుగుదేశం ప్రతిపాదన రూల్ పరంగా లేని విషయం సుష్పష్టంగా కనిపిస్తోందని శాసనమండలి ఛైర్మన్ పేర్కొన్నారని జగన్ గుర్తుచేశారు. అయినా దానిని ఏరకంగా అతిక్రమించాలన్న ఆలోచన కూడా చేశాము... రూల్స్‌కు అనుగుణంగా లేనందున సెలక్ట్ కమిటీకి పంపే పరిస్ధితి లేనందున ఛైర్మన్‌గా నాకున్న విచక్షణాధికారులను రూల్ 154 ప్రకారం ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని తాను నిర్ణయించుకున్నట్లు ఛైర్మన్ చెప్పారని జగన్ సభలో ప్రస్తావించారు.

తనకున్న విచక్షణాధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని ఆయనే చెప్పారని సీఎం తెలిపారు. శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి తనకు సంబంధంలేని సభ గ్యాలరీలో కూర్చొని ఎలాంటి ఆదేశాలు, సంకేతాలు ఇవ్వడానికి కూర్చొన్నారని జగన్ దుయ్యబట్టారు.

చట్టసభ చట్టం ప్రకారం నడుస్తుందా లేక ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తుందా అని జగన్ ప్రశ్నించారు. శాసనమండలి ప్రజల ఇష్ట ప్రకారం జరుగుతుందా లేక ఓడిపోయిన నాయకుడి ప్రయోజనాల ప్రకారం నడుస్తుందా అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

Alsio Read:40 ఇయర్స్ ఇండస్ట్రీ జగన్ దెబ్బకు గ్యాలరీలోకి: బాబుపై కొడాలి సెటైర్లు

మండలి అనేది సలహాలు, సూచనలు చేసే పెద్దల సభ మాత్రమేనని, కానీ బిల్లులను చట్టం కాకుండా నిరోధించే సభగా ఇవాళ మారిపోయిందన్నారు. తప్పు అని తెలిసి కూడా, తప్పును ఒప్పుకుని కూడా, అయినా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి తప్పు చేస్తానంటున్న మండలి ఛైర్మన్ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అని జగన్ నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios