Asianet News TeluguAsianet News Telugu

చర్యలు తప్పవు: ఏపీ శాసమండలి సెక్రటరీకి ఛైర్మెన్ షరీఫ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో జాప్యం చేస్తే చర్యలు తీసుకొంటానని మండలి ఛైర్మెన్ షరీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇచ్చారు. 

Ap legislative council chairman shariff warns to secretary over select committee appoint
Author
Amaravathi, First Published Feb 13, 2020, 11:54 AM IST

అమరావతి:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో  జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని శాసనమండలి సెక్రటరీపై  ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ హెచ్చరించారు. .

ఏపీ శాసనమండలిలో రెండు బిల్లులపై సెలెక్ట్ కమిటీ  ఏర్పాటు దస్త్రాన్ని సెక్రటరీ ఛైర్మెన్‌కు తిప్పి పంపడంపై ఆయన సీరియస్ అయ్యారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో జాప్యం చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు.

Also read:సెలక్ట్ కమిటీ వివాదం: బిల్లు ఆమోదం పొందినట్లేనన్న వైసీపీ, ఎలా అన్న టీడీపీ

 సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా బులెటిన్ విడుదల చేయాలని ఈ నెల 10వ తేదీన టీడీపీ ఎమ్మెల్సీలు సెక్రటరీని కోరారు. అయితే  సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించబోవని సెక్రటరీ మండలి ఛైర్మెన్  కు అదే రోజున నోట్ పంపారు.

ఈ విషయమై సెక్రటరీ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని కూడ టీడీపీ భావిస్తోంది.ఇదిలా ఉంటే 14 రోజులు పూర్తైనందున పాలనా వికేంద్రీకరణ బిల్లు,సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పాసైనట్టేనని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది.

అయితే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం అన్ని పార్టీలు తమ పేర్లను పంపించినందున సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా బులెటిన్ విడుదల చేయాలని టీడీపీ  శాసనమండలి సెక్రటరీని కోరింది..సెలెక్ట్ కమిటీ ఏర్పాటు  చేసిన తనకు నివేదించాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్   ఎంఏ షరీఫ్ గురువారం నాడు సెక్రటరీని ఆదేశించారు.

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని   సెక్రటరీ నోట్ పంపండంపై ఛైర్మెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సెలెక్ట్ కమిటీ  ఏర్పాటు విషయంలో ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని మండలి ఛైర్మెన్ హెచ్చరించారు.48 గంటల్లో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ లేఖ ఇంకా సెక్రటరీకి అందిందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీలకు పంపాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ గతంలో ప్రకటించారు. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి  పంపించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios