Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ తీసుకుని అమ్మాయిలతో లోకేష్... ఆధారాలవే: కాపు కార్పోరేషన్ ఛైర్మన్ సంచలనం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Kapu Carporation Chairman Adapa Sheshu Sensational Comments on Nara Lokesh
Author
Vijayawada, First Published Sep 28, 2021, 2:35 PM IST

విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అమ్మాయిలతో ఉండి డ్రగ్స్ (Drugs) తీసుకుంటున్నట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయని కాపు కార్పొరేషన్ (Kapu Carporation) చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్, వైసిపి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను (Samineni Udatabhanu) కుమారుడు వెంకట కృష్ణప్రసాద్ గంజాయి వ్యాపారం చేస్తున్నాడన్న ప్రచారంపై స్పందిస్తూ లోకేష్ అమ్మాయిలతో వున్న ఫోటోల గురించి ప్రస్తావించారు శేషు. 

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై కూడా శేషు విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం‌ జగన్ సుపరిపాలన చూసి టీడీపీ నేతలు కంగారు పడుతున్నారని అన్నారు. అందుకే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు లాగా కులాల మధ్య చిచ్చుపెట్టే పనులు సీఎం జగన్ చేయలేదని మండిపడ్డారు. 

''ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మంత్రి అవుతారేమో అన్న భయంతోనే ఆయన కుమారుడిపై రూమర్లు సృష్టిస్తున్నారు. కాపు కమ్యూనిటీలో సామినేని మరో వంగవీటి మోహనరంగ అవుతారని భయపడుతున్నారు. సామినేనిపై రూమర్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ కి లెటర్ ఇస్తాం'' అన్నారు. 

READ MORE  సినీ పరిశ్రమకు గుదిబండ: పవన్ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్

''టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తన వాగ్ధాటితో భయపెట్టాలని చూస్తే సహించం. కాపులను రెచ్చగొడితే పట్టాభి లాంటి వారు రోడ్లపై తిరగలేరు'' అంటూ శేషు హెచ్చరించారు.

''జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ద్వారా కాపులను విడదీసే కార్యక్రమం చేస్తున్నారు. కులాన్ని భ్రష్టు పట్టించద్దని అందరినీ వేడుకుంటున్నా. కాపులను దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలని పవన్ కు నా వినతి. కాపులు ఎక్కడ సీఎం జగన్ కు దగ్గర అవుతారో అనే భయంతోనే పవన్ ను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారు'' అన్నారు. 
 
''జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాపు కార్పొరేషన్ కు రూ.13వేల కోట్లు ఖర్చుపెట్టాం. నవంబర్ నుంచి కాపు కార్పొరేషన్ మరింత యాక్టివ్ గా పని చేస్తుంది'' అని  కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios