విజయవాడ గ్యాంగ్ రేప్ : హోంమంత్రి తానేటి వనిత సీరియస్.. నిందితులపై చర్యలకు ఆదేశం

బెజవాడలో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

ap home minister taneti vanitha serious on vijayawada gang rape case

విజయవాడ అత్యాచార ఘటనపై ఏపీ హోంమంత్రి (ap home minister) తానేటి వనిత ఆగ్రహం (taneti vanitha) వ్యక్తం చేశారు. ఐజీ, సీపీలతో ఫోన్లో మాట్లాడిన ఆమె వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని తానేటి వనిత హెచ్చరించారు. 

కాగా.. vijayawadaలో మతిస్థిమితం సరిగా లేని యువతిపై సామూహిక అత్యాచారానికి (gang rape) పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 29వ  తేదీన యువతి ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే యువతిని విజయవాడ hospitalలో పనిచేసే యువకుడు తీసుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

అటు మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని నున్న పోలీస్ స్టేషన్ వద్ద లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, లెఫ్ట్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ కేసును దిశ ఏసీపీ దర్యాప్తు చేస్తున్నట్టుగా విజయవాడ సీపీ ప్రకటించారు.  నిందితులను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.  

యువతి ఇంటి నుండి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము అనుమానిస్తున్న నిందితుడి ఫోన్ నెంబర్‌ను పోలీసులకు ఇచ్చినా కూడా సరిగా స్పందించలేదని బాధితురాలి సోదరుడు వాదిస్తున్నాడు. తాము చెప్పినప్పుడే పోలీసులు స్పందిస్తే తమ సోదరిపై ఈ దారుణం జరిగి ఉండేది కాదని అతను వాపోతున్నాడు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా ఉండేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం కోరుతుంది. నిందితులను ఉరి తీయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తోంది. బయట ప్రపంచం తెలియని తన బిడ్డపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios