కర్నూలుకు కార్యాలయాల తరలింపు విషయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇటీవల  ఏపీ హైకోర్టులో విచారణ ముగిసిన సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని  హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read అమరావతి : కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వానికి హై కోర్టు షాక్...

 వాదనలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటిషనర్లను హై కోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్లు లేకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్ చేయడం సరికాదనన్న హైకోర్టు చీవాట్లు వేసింది. ఏ కారణాలతో ఆఫీసులను తరలిస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో... ప్రభుత్వ తరపు సంబంధిత అధికారులు సోమవారం అఫిడవిట్ దాఖలు చేశారు. సచివాలయ భవానాల్లో స్థలం కొరత ఉందని.. అందుకే కార్యాలయాలను తరలిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంతో సంబంధం లేని ఆఫీసుల తరలింపు ప్రతిపాదన ఉందన్నారు. ఏపీ విజిలెన్స్ కమిషనర్, పీఆర్సీ  కమిషనర్ తోపాటు మరో 10 విభాగాల తరలింపుపై ప్రతిపాదనలు ఉన్నట్లు చెప్పారు.