Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లీష్‌ మీడియంపై విమర్శలు: ప్రతిపక్షాలకు జగన్ స్ట్రాంగ్ కౌంటర్

రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం విద్యా విధానంపై ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు

ap cm ys jaganmohan reddy fires on opposition parties over english medium
Author
Amaravathi, First Published Dec 12, 2019, 8:23 PM IST

రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం విద్యా విధానంపై ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఇంగ్లీష్ మీడియం అనగానే ఒక సామాజిక వర్గం ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టిందని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును సైతం సీఎం ప్రస్తావించారు.

మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం లేదా అంటూ ప్రశ్నించిన ఆయన పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై తెలుగుదేశం పార్టీ అనేక యూ టర్న్‌లు తీసుకుందని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకు టీడపీ ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందని సీఎం ఫైరయ్యారు.

Also Read:వీధి బడిలో చదువుకున్నా.. తిట్లు నాక్కూడా వచ్చు: జగన్‌కు పవన్ సవాల్

హేతుబద్ధీకరణ పేరుతో దాదాపు 6 వేల స్కూళ్లు మూసివేశారని.. పిల్లలంతా నారాయణ, చైతన్య స్కూళ్లకు వెళ్లడమే అప్పటి ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకే ఆ చర్యలని జగన్ ఎద్దేవా చేశారు.

తాము చేస్తోంది ఒక విప్లవాత్మక పరిణామం అని, ‘రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియమ్‌’ అన్నది తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు చేపట్టామన్న ఆయన, ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో రాష్ట్రంలోని 45 వేళ్ల స్కూళ్లను బాగు చేస్తున్నామని వెల్లడించారు.

గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం చేసిన వ్యయం ఏటా కనీసం రూ.50 కోట్లు కూడా లేవని, ఈ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి అలా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆక్షేపించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా ఉంటుంది. మన పిల్లలు ఇంగ్లిష్‌లో పట్టు సాధించకపోతే, ప్రపంచ పోటీ ఎదుర్కోలేరు. నిరుపేద పిల్లల జీవితాలు మార్చడం కోసమే గట్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ వేదికగా చెబుతున్నానని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.

Also Read:టీడీపీ సభ్యుల పక్కన కూర్చొని, అంబటికి స్లిప్పులు: హాట్‌ టాపిక్‌గా వంశీ తీరు

చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ను ఎక్కడ చదివించాడు? మనవణ్ని ఏ మీడియమ్‌లో చదివించాడు? చంద్రబాబు పక్కన అచ్చెన్నాయుడు ఉన్నాడు. ఆయన కొడుకును ఏ మీడియమ్‌లో చదివించారని జగన్ ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios