Asianet News TeluguAsianet News Telugu

ఏపీ శాసనమండలి రద్దు: అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన జగన్

ఏపీ శాసనమండలిని రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

AP Cm Ys Jagan introduces Ap legislative council abolish resolution in assembly
Author
Amaravathi, First Published Jan 27, 2020, 12:07 PM IST

అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు  ప్రవేశపెట్టారు.సోమవారంనాడు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే  ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని  కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ను స్పీకర్ కోరారు.

Also read:ఆ ఇద్దరు మంత్రులకు అండగా ఉంటా: కేబినెట్ లో జగన్

స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించిన వెంటనే  సీఎం జగన్ ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని  ప్రవేశపెట్టారు.ఈ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే వైసీపీకి చెందిన సభ్యులు బల్లలు చరిచి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.  

ఈ విషయమై చర్చను ప్రారంభిస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ చర్చను వైసీపీ సభ్యుుడు ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబునాయుడు కారణమని నాని ఆరోపించారు.

సోమవారం నాడు ఉదయం ఏపీ కేబినెట్  ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలనే తీర్మానానికి ఆమోదం తెలిపింది.ఈ తీర్మానాన్ని సీఎం జగన్ సభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి జగన్ ప్రభుత్వం పంపనుంది.  

Also read:ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోదం

సోమవారంనాడు ఒక్క రోజు పాటే అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. బీఏసీ సమావేశానికి టీడీపీ గైర్హాజర్ అయ్యారు. అసెంబ్లీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొన్నందున  బీఏసీ సమావేశానికి కూడ ఆ పార్టీ దూరంగా ఉంది.సోమవారం నాడే ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. 

Also read:ఏపీ శాసనమండలి రద్దైతే ఆ ఇద్దరు మంత్రులకు ఎసరు

ఏపీ శాసనమండలి రద్దుపై ఏపీ ప్రభుత్వం పంపిన తీర్మానంపై కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

 
  

Follow Us:
Download App:
  • android
  • ios