ఎల్. రమణకు క్లాస్ పీకిన చంద్రబాబు

First Published 4, May 2018, 3:56 PM IST
ap cm chandrababu serious on tdp telangna president l.ramana
Highlights


అమాయకంగా ఉంటే నడవదిక్కడ

 టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణకు చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు.  రమణ పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, దైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని రమణకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.

మెతక వైఖరి మానుకోవాలని, కఠినంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మహానాడు తరువాత మళ్లీ వస్తానని అప్పటిలోగా పార్టీ కమిటీలు పూర్తి చేస్తానని రమణకు బాబు చెప్పారు. జాతీయ మహనాడు తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని పేర్కొన్నారు. 2019లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో తనకు బాగా తెలుసని చంద్రబాబు అన్నారు.

ఇప్పటికే తాను జాబితా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.  ప్రతిభను బట్టి ముందుగానే టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. మనం బలంగా ఉంటేనే ఎవరైనా పొత్తులకు ముందుకు వస్తారని చంద్రబాబు రమణకు సూచించారు.

loader