Asianet News TeluguAsianet News Telugu

స్థానిక ఎన్నికల్లో డబ్బులు పంచుతూ పట్టుబడితే అనర్హత, జైలు శిక్ష: ఏపీ కేబినెట్ సంచలనం

స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు పంచుతూ పట్టుబడితే  అనర్హత వేటు వేయడంతో జైలు శిక్ష విధించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. 

Ap cabinet approves to Reduces campaign tenure in local body elections
Author
Andhra Pradesh, First Published Feb 12, 2020, 12:34 PM IST


అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో నగదు, మద్యం పంచుతూ పట్టుబడితే  వెంటనే ఆ అభ్యర్ధి వెంటనే అనర్హతకు గురయ్యే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన  జరిగింది. గంటన్నరపాటు ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్  ఆమోదం తెలిపింది. 

ఈ బడ్టెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. కేబినెట్‌లో తీసుకొన్న నిర్ణయాలను మంత్రి పేర్నినాని బుధవారం నాడు మీడియాకు వివరించారు.

ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం  నిర్ణయం తీసుకొంది.  మార్చి 15వ తేదిలోపుగా  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని  కేబినెట్ నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి నాని చెప్పారు.

డబ్బు,మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలనేది తమ ప్రభుత్వ అభిమతమన్నారు మంత్రి.  ఎన్నికల్లో డబ్భులు,మద్యం పంచు అభ్యర్థులు దొరికితే వారి అనర్హత వేటు వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన వివరించారు.  

ఎన్నికల నియమాల ప్రకారం ఎవరైనా అభ్యర్థులు  ఎన్నికల ప్రచారంలో డబ్బులు, మద్యం పంచుతూ  దొరికితే మూడు సంవత్సరాలు శిక్ష తో పాటు అనర్హత వేటు వేసేలా చట్టం తీసుకురానున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి నాని ప్రకటించారు. 

పంచాయతీ ఎన్నుకలను ప్రక్రియ ను 13 రోజుల నుండి 15 రోజుల మార్చే చట్టానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా ఆయన తెలిపారు. పంచాయతీ ప్రచారం గడువును  5 ఐదు రోజులకు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు వారం రోజుల పాటు గడువును విధించామన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ15 రోజులకు కుదించినట్టుగా ఏపీ సర్కార్ ప్రకటించింది. 

ఎన్నికైన సర్పంచులు కచ్చితంగా ఆయా గ్రామాల్లో ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు. ఏపీ నాన్‌ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టుగా  మంత్రి నాని చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios