దాచేపల్లిలో మరో అత్యాచార ఘటన: నిందితుడు స్థానిక టీడీపి నేత?

Another rape incident at Dachepalle in Guntur district
Highlights

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది.

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. 9 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం జరిపిన సంఘటన జరిగిన వారం లోపలే మరో సంఘటన బయటపడింది. 13 ఏళ్ల బాలికపై మాజీ ఎంపిటీసి వలీ అత్యాచారం చేసినట్లు బాలిక కటుుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతను తెలుగుదేశం పార్టీ కోప్షన్ సభ్యుడని సమాచారం. బాలికపై అత్యాచారం చేసిన వలీ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాచేపల్లిలో ఇటీవల 9 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపడమే కాకుండా అది రాజకీయ రంగును కూడా పులుముకుంది. నిందితుడు సుబ్బయ్య చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. 

మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలు కూడా నిర్వహించింది. దాచేపల్లి ఘటనల వంటిని జరిగితే నిందితులను వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు కూడా.

loader