ఎంపీలు అలా మాట్లాడుతుంటే.. చంద్రబాబు నోటీసులివ్వరా..?

ambati rambabu fires on chandrababu naidu
Highlights

ఎంపీలు అలా మాట్లాడుతుంటే.. చంద్రబాబు నోటీసులివ్వరా..?

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎంపీ సీఎం రమేశ్ చేస్తోన్న దీక్షను ఉద్దేశించి టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ నేత అంబటి రాంబాబు. ఢిల్లీ సాక్షిగా టీడీపీ ఎంపీల నాటకాలు బయటపడ్డాయని...విభజన హామీలు నెరవేర్చాలనే చిత్తశుద్ధి వారికి లేదన్నారు.. సీఎం రమేశ్‌ది ఉక్కు దీక్ష కాదు.. తుక్కు దీక్ష అని స్వయంగా ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే స్వయంగా అన్నారంటే.. రాష్ట్రాభివృద్ధిపై తెలుగుదేశం ఎంపీల చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవచ్చని అంబటి ఆరోపించారు.

ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి తన ఎంపీలను కంట్రోల్‌లో పెట్టడం లేదని.. దీనిని సీరియస్‌గా తీసుకుని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు నోటీసులివ్వాలని రాంబాబు డిమాండ్ చేశారు. హోదా కోసం వైఎస్సార్  కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు అవహేళన చేశారు..

టీడీపీ నేతలు రాజీనామాలు చేయరు కానీ.. విచిత్రంగా దీక్షలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు.. బీజేపీతో పోరాడుతున్నట్లుగా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారన్నారు.. వైసీపీని విమర్శించేందుకే టీడీపీ నేతలు ఏరువాకను వాడుకుంటున్నారని ఆరోపించారు. కమీషన్ వచ్చే రంగాలపైనే చంద్రబాబు దృష్టిసారించారని విమర్శించారు. 

loader