నిన్న వైసీపీ వారికి, జనసేన నేత, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మధ్య ట్విట్టర్ వార్ నడిచిన విషయం తెలిసిందే. నిన్న ఒకరకంగా విజయసాయి రెడ్డికి, నాగబాబు మధ్య బుల్లెట్ల లాగ ట్వీట్లు పేలాయి. 

ఇప్పుడు అంబటి రాంబాబు తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన తోక లేని పిట్ట తీయటీ కి కౌంటర్ ఇచ్చారు

నాగబాబు తాజాగా అంబటి రాంబాబు తోకలేని పిట్ట సినిమాలో నటిస్తూ వేదిక మీద మాట్లాడే సీన్ ని పెట్టి వ్యంగ్యంగా.."నేను అంబటి గారి మీద జోక్ వెయ్యలేదు.ఆయన నిజంగానే ఒక మంచి నటుడు.ఈ తోకాలేని పిట్ట నటించిన సారి సారి ఈయన నటించిన తోకాలేని పిట్ట లో ఒక గొప్ప హవా భావాలు .." అని రాసుకొచ్చారు. 

దీనిపై స్పందించిన రాంబాబు... "నేను తోకలేని పిట్ట లో నటించిన సంగతి నేనే మరచితిని ...ధన్యవాదాలు నాగాబాబు గారికి గుర్తుంచుకున్నందుకు ..నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను ..రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా...........లేక .." అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఈ ట్వీట్ కి తోడుగా... "బహు పాత్రలలో బాగు బాగు" అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు. 

నాగబాబు ఈ పోస్టును పెట్టె ముందు రోజు రాంబాబు మరో రెండు ట్వీట్లను చిరంజీవి సోదరులనుద్దేశించి చేసారు.