Asianet News TeluguAsianet News Telugu

రాజధాని రచ్చ: పండుగ పూట గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలు సాగుతున్నాయి.రాజధాని తరలిస్తారనే మనోవేదనతో ఇద్దరు రైతులు మృతి చెందారు. 

amaravathi:Farmer dies of cardiac arrest at velagapudi village in guntur district
Author
Amaravathi, First Published Jan 15, 2020, 11:29 AM IST

అమరావతి: అమరావతి నుండి రాజధాని తరలిపోతోందనే మనోవేదనతో  రాజధాని ప్రాంతానికి చెందిన ఇద్దరు రైతులు మృతి చెందారు. ఇద్దరు కూడ వెలగపూడి గ్రామానికి చెందినవారే. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే సంకేతాలు రావడంతో అమరావతి పరిసర గ్రామాల ప్రజలు 29 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకో రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

వెలగపూడి గ్రామానికి చెందిన రైతు ఇడుపులపాటి వెంకటేశ్వరరావు రాజధాని తరలిపోతోందని ఆవేదనకు గురై గుండెపోటుతో బుధవారం నాడు మృతి చెందాడు. ఆయన వయస్సు 70 ఏళ్లు.

ఇదే గ్రామానికి చెందిన మరో రైతు అంబటి శివయ్య కూడ బుధవారం నాడు గుండెపోటుకు గురై మరణించాడు.  సంక్రాంతి రోజున ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు మృతి చెందడంతో గ్రామంలో విషాధం నెలకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios