Asianet News TeluguAsianet News Telugu

పరిటాల రవి హత్యకేసులో నిందితుడి గురించి గొల్లపూడి ఏమన్నారంటే.....

చంచల్ గూడ జైల్లో ఖైదీ నంబర్ 412గా ఉన్న మెుద్దు శీను లేఖ రాయడం ఎప్పటికీ మరచిపోనని గొల్లపూడి చెప్పుకొచ్చారు. తనకు ఆనాటి భారత ప్రధాని పీవీ నరసింహారావు, ఆ తర్వాత జైల్లో హత్యగావించబడిన మెుద్దు శీనులంటే తన అభిమానులుగా చెప్పుకుంటానని తెలిపారు. 

Actor Gollapudi Marutirao death: Gollapudi interesting comments on Moddu Seenu
Author
Hyderabad, First Published Dec 12, 2019, 4:30 PM IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మెుద్దు శీనుపై గొల్లపూడి మారుతీరావు కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో చంచల్ గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మెుద్దు శీను తనకు నాలుగు పేజీల ఉత్తరం రాశారని గుర్తు చేశారు. ఓ చానెల్ కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాలను పంచుకున్నారు.

తన చిన్నతనంలో గొల్లపూడి మారుతీరావు గురించి తెలిస్తే రోకలితో బుర్రబద్దలు కొట్టేవాడినని మొద్దు శీను లేఖలో రాసినట్లు గుర్తు చేశారు. గొల్లపూడి రాసినటువంటి రచనలు, ఆయన వేషాలు చూస్తే అలానే అనిపించిందని లేఖలో మొద్దు శీను చెప్పుకొచ్చారట. 

అయితే ఆ అభిమాని సాయంకాలం నవల చదివిన తర్వాత తనను గురువుగా భావించినట్లు లేఖలో చెప్పాడని ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా తనను గురువుగా భావిస్తున్నానని లేఖలో ప్రస్తావించడం చూసి చాలా సంతోషపడినట్లు తెలిపారు. 

జర్నలిస్టుగా గొల్లపూడి... అప్పట్లోనే గడగడలాడించాడు...

 చంచల్ గూడ జైల్లో ఖైదీ నంబర్ 412గా ఉన్న మెుద్దు శీను లేఖ రాయడం ఎప్పటికీ మరచిపోనని చెప్పుకొచ్చారు. తనకు ఆనాటి భారత ప్రధాని పీవీ నరసింహారావు, ఆ తర్వాత జైల్లో హత్యగావించబడిన మెుద్దు శీనులంటే తన అభిమానులుగా చెప్పుకుంటానని తెలిపారు. 

తన ఆత్మకథలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి, జైల్లో హత్యగావించబడిన మెుద్దు శీనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు నటుడు గొల్లపూడి మారుతీరావు. పీవీ నరసింహారావు, మెుద్దు శీను తర్వాత తనకు అనేక మంది అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

గొల్లపూడి మారుతీరావు: మెుదటి సినిమా చిరంజీవితోనే...

నటుడిగా, రచయితగా ఇలా ఎన్నో రంగాల్లో విశేష సేవలందించిన గొల్లపూడి మారుతీరావు గురువారం చెన్నై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోరజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. 

గొల్లపూడి మారుతీరావు మరణంతో టాలీవుడ్ తోపాటు పలువురు సాహితీవేత్తలు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. గొల్లపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

రత్నాన్ని కోల్పోయాం.. గొల్లపూడి మృతికి మహేష్ బాబు, అనుష్క సంతాపం!...

Follow Us:
Download App:
  • android
  • ios