నూజివీడు: కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలోని  ఓ తోటకు కాపలా ఉంటున్న కుటుంబంపై కన్నేసిన  శ్రీనివాసరావు అనే వ్యక్తి  ఆ కుటుంబంలోని  ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నూజివీడు మండలంలోని ఓ తోటకు ఓ కుటుంబం కాపలా ఉంటుంది. కాపలాగా ఉంటున్న వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. రెండో కూతురితో కలిసి తోటలో నివాసం ఉంటున్నాడు.  సెప్టెంబర్ 9వ తేదీన  బాధితురాలి తండ్రి పనిమీద నూజివీడుకు వెళ్లాడు. 

అయితే ఈ తోటకు పక్కనే  మరో తోటను పిన్నిబోయిన శ్రీనివాసరావు అనే వ్యక్తి లీజుకు తీసుకొన్నాడు. అయితే సెప్టెంబర్ 9వ తేదీన తోటలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన నిందితుడు  బాధితురాలి వద్దకు వచ్చి  అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే నూజివీడు నుండి ఇంటికి వచ్చిన బాధితురాలి తండ్రి కూతురిని చూసి చలించిపోయాడు.బాధితురాలి తండ్రి  పోలీసులకు సమాచారామిచ్చాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాసరావును  పోలీసులు అరెస్ట్ చేశారు.