విజయవాడ: విజయవాడలో డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు.  ఈ కేసులో ఇద్దరు విదేశీయులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీయుల పాస్ పోర్టులను పోలీసులు సీజ్ చేశారు.

విజయవాడలో బీటెక్ చదివిన కోనేరు అర్జున్ అనే విద్యార్ధి డ్రగ్స్ ను విక్రయించినట్టుగా పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరులో బీటెక్ చదివినట్టుగా పోలీసులు గుర్తించారు.

also read:హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ: వెంకటరమణ హత్య కేసులో కడపలో ముగ్గురి అరెస్ట్

సూడాన్, టాంజానియాకు చెందిన ఇద్దరు విదేశీయుల నుండి  అర్జున్ డ్రగ్స్ ను కొనుగోలు విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు.అర్జున్ నుండి ఎవరెవరు డ్రగ్స్ ను కొనుగోలు చేశారనే విషయమై కూడ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. 

సూడాన్ కు చెందిన రసూల్, టాంజానియాకు చెంది యోనాను విజయవాడ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుల పాస్ పోర్టులను సీజ్ చేశారు. 

పాత పరిచయాలతో కోనేరు అర్జున్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కేసులో విదేశీయులు అరెస్ట్ కావడం విజయవాడలో ఇది రెండోసారి.  నిందితుల నుండి 17 గ్రాముల ఎండిఎంఏ టాబ్లెట్స్, 150 గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.