ప్రియుడిని బెదిరించి యువతిపై గ్యాంగ్‌రేప్: ఇద్దరు నిందితుల అరెస్ట్

2 accused of raping nurse arrested
Highlights

స్టాఫ్‌నర్స్‌ను బెదిరించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఇాద్దరి అరెస్ట్


గుంటూరు: ప్రియుడి ముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన  ఇద్దరు నిందితులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు  మీడియాకు వివరించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన 24 ఏళ్ల యువతి గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు మేడికొండూరు మండలం మందపాడుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది.

ప్రతిరోజూ  డ్యూటీ ముగియగానే ప్రియుడి ద్విచక్ర వాహనంపై ఆమె ఇంటికి వెళ్లేది. గత నెల 29వ తేది రాత్రి పది గంటలకు  ఇద్దరూ కలిసి ఆత్మకూరు సమీపంలోని పొలాల వద్ద మాట్లాడుకొంటున్నారు. ఆ సమయంలో ఆత్మకూరుకు చెందిన రాసగిరి రాఘవయ్య, అతడి బావమరిది యాటగిరి అలియాస్‌ ఇండ్ల శ్రీనివాస్‌‌ను బెదిరించారు.  ప్రియుడిని కొంత దూరం తీసుకెళ్లి చంపేస్తామని హెచ్చరించారు. బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. తెల్లవారుజాము వరకు బాధితురాలిపై రేప్ చేశారు.

భయంతో ప్రియుడు పారిపోయాడు. అంతేకాదు బాధితురాలి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కూడ దోచుకొన్నారు. బాధితురాలు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు జరిగిన ఘటనను వివరించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో నిందితుల వివరాలు వెలుగు చూశాయి.

ఈ ఘటనకు సంబంధించి ప్రియుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.కానీ, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి క్లూ కూడ పోలీసులకు లభ్యం కాలేదని ఆయన చెప్పారు. నిందితులు మాట్లాడిన యాస, భాష,  ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు  రాసగిరి రాఘవయ్య, ఇండ్ల శ్రీనివాస్ ను విచారిస్తే నిందితులు అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

loader