ఆ కిడ్నాపర్ నటాషాను తన ఇంటిలోనే ఓసీక్రెట్ ప్లేస్ లోనే దాచిపెట్టడం గమనార్హం. అతని ఇంటి బేస్మెంట్ లోపల ఓ గదిలో నటాషాను బంధించాడు. ఆ ఇంటికి కనీసం కిటికీలు కూడా లేవు.
ఎవరైనా మీ దగ్గరకు వచ్చి.. స్వేచ్ఛ విలువ ఎంతో తెలుసా..? అంటే మీరు సమాధానం చెప్పగలరా..? ఆస్ట్రేలియాకి చెందిన ఓ యువతి మాత్రం.. నాకు తెలుసు అంటోంది. ఎందుకంటే.. ఊహతెలియని వయసులోనే బంధీగా మారిపోయి తనదికాని జీవితంలో ఎనిమిదేళ్లపాటు బతికేసింది. ఆ యువతి పేరు నటాషా.
ఆమెకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు అంటే.. 1998 మార్చి 2వ తేదీన స్కూల్ కి వెళ్తుంటే.. ఓ యువకుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. బలవంతంగా నటాషాను ఓ తెల్ల వ్యాను లాకెళ్లడాన్ని కొందరు ప్రత్యక్షంగా చూడటం గమనార్హం. వాళ్లు చెప్పిన ఆధారాలతో నటాషా కోసం పోలీసులు చాలా చోట్ల గాలించారు. కానీ.. లాభం లేకుండా పోయింది.
కాగా.. ఆ కిడ్నాపర్ నటాషాను తన ఇంటిలోనే ఓసీక్రెట్ ప్లేస్ లోనే దాచిపెట్టడం గమనార్హం. అతని ఇంటి బేస్మెంట్ లోపల ఓ గదిలో నటాషాను బంధించాడు. ఆ ఇంటికి కనీసం కిటికీలు కూడా లేవు. ఎవరికీ తెలియకుండా.. ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపాడు. రెండు సంవత్సరాలపాటు ఆమెను అదే గదిలో బంధించాడు.
రెండేళ్ల పాటు నరకం చూసిన తర్వాత నటాషా కిడ్నాపర్ చెప్పినట్లు వినడం ప్రారంభించింది. ఆ తర్వాతే.. నటాషాను అతను ఆ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు రావడానికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు కూడా.. ఇంట్లో మాత్రమే తిరగడానికి అవకాశం ఇచ్చేవాడు. అది కూడా అతను ఇంట్లో ఉన్నంత వరకే. అతను బయటకు వెళ్లాల్సినప్పుడు.. నటాషాను ఇంట్లో ఉంచేసి గదికి తాళం వేసి వెళ్లేవాడు.
నటాషాను కిడ్నాప్ చేసినప్పుడు చాలా రోజులపాటుు ఆమె ఒంటిపై ఒక్క డ్రాయర్ తప్ప మరేమీ లేకుండా చేశాడు. ఈ విషయం తనకు ఇప్పటికీ ఇంకా గుర్తందని నటాషా వాపోయింది. అయితే.. అతని వల్ల తనకు జరిగిన మంచి అంటూ ఏదైనా ఉంది అంటే.. చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చేవాడు. ఆ పుస్తకాలు చదివి తాను చాలా విషయాలు తెలుసుకున్నానని నటాషా పేర్కొంది.
ఆమెను కిడ్నాప్ చేసిన తొలి రోజుల్లో కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇచ్చేవాడు కాదట. అతను చెప్పిన దానికి వినడం మొదలుపెట్టిన తర్వాతే.. ఆమె అడిగిన ప్రతి సౌకర్యం అమర్చాడట. ఆ ఎనిమిదేళ్ల కాలంలో తనతో మాట్లాడే ఏకైక వ్యక్తి అతనే కావడంతో.. అతను ఏం చెప్పినా మాట్లాడకుండా వింటూ ఉండేదట.
2006, ఆగస్టు 23వ తేదీన ఓ రోజు ఆ కిడ్నాపర్.. ఆమెను కారు శుభ్రం చేయమని వాక్యూమ్ క్లీనర్ ఇచ్చాడట. అప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. ఆమె కారు క్లీన్ చేస్తున్నంత సేపు పక్కనే ఉన్నాడట. అప్పుడే అతనికి ఓ ఫోన్ కాల్ రావడంతో.. కాసేపు పక్కకి వెళ్లిపోయాడు. అదే అదునుగా చేసుకున్న నటాషా.. మనసులో గట్టి నిశ్చయించుకొని పరుగెత్తడం మొదలుపెట్టిందట.
తనకు జీవితంలో వచ్చిన చివరి అవకాశం ఇదేనని భావించి.. కిడ్నాపర్ నుంచి తప్పించుకొని పరిగెత్తింది. చివరకు అతని చెర నుంచి బయటపడింది. అలా తన కాళ్లు నొప్పి పుట్టేంత వరకు పరిగెత్తింది. దగ్గరలోని ఓ రెండు ఇళ్లకు వెళ్లి తనకు సహాయం చేయమని అడిగింది. అయితే.. వాళ్లు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో..మళ్లీ ఇంకా కొద్ది దూరం పరిగెత్తి అక్కడ వేరే వారిని అడిగితే వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
వారి సహాయంతో పోలీసులకు ఆశ్రయించిన నటాషా.. తనకు జరిగినదంతా వారికి వివరించింది. అయితే.. అక్కడి నుంచి బయటపడిన తర్వాత కూడా నటాషా మామూలు మనిషి కాలేకపోయిందట. మళ్లీ తన తల్లిదండ్రులకు దగ్గర కావడానికి చాలా సమయమే పట్టిందట. అయితే..చాలా మంది ఆమె పడిన కష్టాలకంటే.. ఇన్ని సంవత్సరాలు ఎందుకు తప్పించుకోలేదు అనే మాట్లాడుకోవడం ఆమెను చాలా బాధించాయి.
కాగా.. ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి కొంత కాలానికి చనిపోతే.. అతని శవాన్ని చూడటానికి కూడా ఆమె అక్కడికి వెళ్లడం గమనార్హం. వెళ్లి అతని ఆత్మకు శాంతి చేకూరాలని మరీ కోరుకుంది. కాగా.. తన జీవితంలో తాను ఎదుర్కొన్న సంఘటనలన్నింటినీ ఓ పుస్తకంగా పేర్చింది. ఆ పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేసింది.