Woman
లాంగ్ లాస్టింగ్ మేకప్ లో ఉండే పదార్థాలు చర్మ రంధ్రాలను మూసేసి నూనె, చెమట బయటకు రాకుండా చేస్తాయి. దీంతో ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి.
లాంగ్ లాస్టింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఆల్కహాల్ తో పాటుగా డ్రైయింగ్ ఏజెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన చర్మం పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల ముఖంపై ముడతలు ఏర్పడే అవకాశం ఉంది.
దీర్ఘకాల మేకప్‌లో ఉండే సువాసనలు,పారాబెన్స్, ప్రిజర్వేటివ్స్ వంటి రసాయనాలు చర్మానికి అస్సలు మంచివి కావు.వీటివల్ల చర్మం దురదపెట్టడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తాయి.
లాంగ్ లాస్టింగ్ మేకప్ ను వాడటం వల్ల చర్మానికి గాలి అందదు. దీనివల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో మీరు తొందరగా ముసలివాళ్లలాగ కనిపిస్తారు.
లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ లేదా పౌడర్ మన ముఖ వెంట్రుకల్లో చిక్కుకుంటుంది. ఇది ముఖం మీదున్న చిన్న చిన్న వెంట్రుకలు రాలిపోయి చర్మం దెబ్బతింటుంది.
లాంగ్ లాస్టింగ్ మస్కారా, ఐలైనర్ల్లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి కళ్లలో మంట, కనురెప్పలు రాలిపోవడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు దారితీస్తాయి.
లాంగ్ లాస్టింగ్ లిప్ స్టిక్ లో ఉండే కెమికల్స్ వల్ల పెదవులు నల్లబడతాయి. అలాగే పెదాలు పొడిబారి పగులుతాయి. ఇది పెదవుల సహజ అందాన్ని పాడు చేస్తుంది.