Woman
రిచా చద్దా లాగా మీరు కూడా కొంచెం బొద్దుగా ఉన్నట్లయితే.. లెహంగాలో స్లిమ్ గా కనిపించాలంటే మోనోక్రమాటిక్ లెహంగా ట్రై చేయండి. మొత్తం ఒకే రంగు లెహంగాలో సన్నగా కనిపిస్తారు.
మీ పొట్టను కనపడకుండా కవర్ చేయాలంటే హై వెస్ట్ ఫ్యాబ్రిక్ లెహంగా ధరించాలి. నెట్ క్లాత్ వి ఎంచుకుంటే బెటర్. సన్నగా కనపడతారు.
సిల్వర్ కలర్ ఆఫ్ షోల్డర్ లాంగ్ బ్లౌజ్ వేసుకుని, అదే ప్యాట్రన్ ఉన్న ఫ్లేర్ లాంగ్ స్కర్ట్ వేసుకుంటే క్లాసీగా మాత్రమే కాదు సన్నగా కూడా కనపడతారు.
లెహంగాలో స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటే, రిచా చద్దా లాగా హై వెస్ట్ లెహంగాతో సాటిన్ ఓవర్ సైజ్ షర్ట్ వేసుకోండి. దాన్ని టక్ ఇన్ చేసి స్టైలిష్ లుక్ పొందండి.
మీరు పుష్టిగా ఉండి, లావుగా కనపడకూడదు అంటే లెహంగాపై బ్లౌజ్ వేసుకునే బదులు లాంగ్ అనార్కలి స్టైల్ కుర్తీ వేసుకోవచ్చు. దీనివల్ల గ్రేస్‌ఫుల్ లుక్ వస్తుంది.
స్లిమ్ లుక్ కోసం ఆఫ్ షోల్డర్ 3D స్టైల్ బ్లౌజ్ వేసుకోవచ్చు. దీనితో పాస్టెల్ కలర్‌లో ఫ్లోరల్ డిజైన్ లెహంగా వేసుకోండి.
రిచా చాడ్డా లాగా పుష్టిగా ఉన్నవారు తక్కువ గేర్ ఉన్న లెహంగాతో షార్ట్ కుర్తీ, ఫ్రంట్ ప్లీటెడ్ చున్నీ వేసుకుని అందమైన లుక్ పొందవచ్చు.