పాత స్వెటర్లు దేనికీ పనికిరావనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటితో టోపీలు, దిండ్లు, గ్లోవ్స్ వంటి ఎన్నింటినో తయారుచేయొచ్చు.
ఫింగర్లెస్ గ్లోవ్స్
అవును పాత ఉన్ని స్వెటర్లతో మీరు ఫింగర్ లెస్ గ్లోవ్స్ ను తయారుచేసి వాడొచ్చు.స్మార్ట్ ఫోన్ ను వాడేటప్పుడు మీ చేతులకు చలిపెట్టకుండా ఉండటానికి ఇవి సహాయపడతాయి.
టోపీ
పాత స్వెటర్ తో మీరు ఎంచక్కా టోపీని తయారుచేసుకుని వాడొచ్చు. మంచి బటన్స్ లాంటివి అంచులకు పెట్టి కొత్త దానిలా కనిపించేలా చేయొచ్చు.
ఓపెన్ కార్డిగన్
పాత స్వెటర్ ను మీరు అందమైన కార్డిగన్గా మార్చుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా జిప్ లేదా బటన్స్ తో దీన్ని తయారుచేయొచ్చు.
ఉన్ని దిండు
పాత స్వెటర్ తో మీరు మెత్తని దిండును తయారుచేసి వాడొచ్చు. ఇందుకోసం స్వెటర్ స్లీవ్స్ తీసేయండి. మిగిలిన భాగంతో దిండు కవర్ ను తయారుచేయండి.
మిటెన్స్
స్వెటర్ ను కింద పరిచి మిటెన్స్ ఆకారం గీసి కట్ చేయండి. దీన్ని సుదీతో కుట్టి మిటెన్లు తయారుచేయండి.