Woman
ఆఫీసుకు వెళ్లడానికి సింపుల్ డిజైన్ కావాలా? పెద్ద మంగళసూత్రాలకు బదులు బంగారం, నల్లపూసల కలయికలో ఒక చిన్న సింపుల్ లాకెట్ తో ఈ మోడల్ ఎంచుకోవచ్చు.
చీర మీద ఎలాంటి నగలు లేకపోయినా రాయల్ లుక్ లో కనిపించాలంటే.. ఈ డబుల్ లేయర్డ్ మంగళసూత్రం ఎంచుకోవాలి. ఈ డిజైన్ మంచి లుక్ ఇస్తుంది.
ఈ మోడల్ నల్లపూసలు డ్రెస్ మీదకు కూడా బాగా సూట్ అవుతాయి. ఎక్కువ బంగారం, అక్కడక్కడ నల్లపూసలు మెరుస్తూ.. మంచి లుక్ ని ఇస్తాయి. ఈ కాలం అమ్మాయిలకు మంచి ఆప్షన్.
మెడ నిండుగా కనిపించాలని కోరుకునే కానీ హారాలు ఇష్టపడని మహిళలు ఇలాంటి రాయి ఉన్న మంగళసూత్రాలు ఎంచుకోవచ్చు. ఇది చోకర్ నెక్లెస్ లా కనపడుతుంది.
బంగారు మంగళసూత్రం కొనడం అందరి బడ్జెట్ లో ఉండదు. అలాంటప్పుడు మీరు ఈ రోజ్గోల్డ్ మంగళసూత్రాన్ని ధరించవచ్చు. దీన్ని క్యూబిక్ చైన్ తో తయారు చేశారు.
ఈ మంగళసూత్రం రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు దీన్ని బంగారంలో చేయించుకోవచ్చు లేదా నకిలీ డిజైన్ లో కూడా ఎంచుకోవచ్చు. ఇది మిమ్మల్ని క్లాసీగా చూపిస్తుంది.