Woman

పనికిరావని పారేయకండి.. ఉల్లిపాయ తొక్కలతో బోలెడు లాభాలున్నాయి

Image credits: social media

ఉల్లిపాయ తొక్కలలోని పోషకాలు

ఉల్లిపాయ తొక్కల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు

ఉల్లిపాయ తొక్కల్ని బాగా కడగండి. వాటిని నీళ్లలో వేసి మరిగించి చల్లారిన తర్వాత తాగండి. దీంట్లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 

Image credits: social media

మెరుగైన జీర్ణక్రియ

ఉల్లిపాయ తొక్కల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

బరువు తగ్గిస్తుంది

ఉల్లిపాయ తొక్కలను మరిగించిన నీళ్లను తాగితే కూడా మీరు బరువు తగ్గుతారు. దీనిలో ఫైబర్ ఎక్కువగా , కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో మీకు ఆకలి తగ్గి తొందరగా కడుపు నిండుతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది

ఉల్లిపాయ తొక్కల వాటర్ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

తెల్ల జుట్టు రాకుండా

ఉల్లిపాయ తొక్కల్లో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది జుట్టు తెల్ల బడటాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టును తెల్లగా చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. 

చర్మానికి మేలు

ఉల్లిపాయ తొక్కల నీటిని ముఖానికి టోనర్‌గా కూడా ఉపయోగించొచ్చు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Find Next One