Woman
రైస్ వాటర్ లో ఉండే లక్షణాలు మన జుట్టును ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది. అసలు రైస్ వాటర్ తో మన జుట్టుకు కలిగే లాభాలేంటంటే?
రైస్ వాటర్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును బలంగా ఉంచుతాయి. అలాగే వెంట్రుకలు తెగిపోకుండా కాపాడుతాయి.
రైస్ వాటర్ లో జుట్టును పొడుగ్గా పెంచే పోషకాలు మెండుగా ఉంటాయి. రైస్ వాటర్ లోని పోషకాలు మన జుట్టుకు మంచి పోషణను అందించి తలలో రక్త ప్రసరణను పెంచుతాయి. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
రైస్ వాటర్ లో ఉండే లక్షణాలు మన జుట్టును స్మూత్ గా చేస్తాయి. మీరు ఈ వాటర్ ను తరచుగా వాడితే గనుక మీ జుట్టు మంచి షైనీగా మెరుస్తుంది.
రైస్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును ఎండ నుంచి, కాలుష్యం నుంచి రక్షిస్తాయి.
రైస్ వాటర్ ను వాడితే తల పొడిబారే అవకాశం ఉండదు. అలాగే నెత్తిమీద దురద, చికాకు తగ్గతాయి. ఈ వాటర్ నెత్తిని తేమగా ఉంచి జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది.