ఖరీదైన క్రీములలో రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఇంటి చిట్కాలలో రసాయనాలు లేకపోవడంతో అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ముఖానికి కలబంద జెల్ రాస్తే చర్మం తేమగా ఉంటుంది, ముడతలు తగ్గుతాయి. దీనికోసం ప్రతిరోజూ ముఖానికి కలబంద జెల్ రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి 2-3 సార్లు వాడవచ్చు.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాసి మసాజ్ చేస్తే చర్మంపై ముడతలు తగ్గుతాయి.
ఒక అరటిపండును చిదిమి, దానికి కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంలో ముడతలు రాకుండా చేస్తుంది.
చందనం ముఖ ముడతలను తగ్గిస్తుంది, రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఫేస్ ప్యాక్‌గా వేయండి. మంచి ఫలితాలు వస్తాయి.
మీ చర్మాన్ని ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు, నిద్ర చాలా అవసరం.