ట్విస్ట్ లాకెట్ మంగళసూత్రాలు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని ధరిస్తే మీరు చాలా స్పెషల్ గా కనపడతారు.
బంగారు గొలుసులో కొన్ని నల్ల ముత్యాలు అమర్చారు. దానికి హార్ట్ షేప్ లాకెట్ జోడించారు. ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది.
నల్ల పూసలకు బదులుగా సాధారణ బంగారు గొలుసులో నల్ల ముత్యాలు ట్రెండీగా, ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. తక్కువ ధరలో ఇలాంటివి దొరుకుతాయి.
చిన్న స్క్వేర్, రౌండ్ ఆకారంలో వజ్రాలు లేదా బంగారు డిజైన్ ఉన్న మంగళసూత్రం సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది.
తేలికైన పొడవైన గొలుసులో రెండు మూడు నల్ల పూసలు ఈ మంగళసూత్రాన్ని అందంగా చూపిస్తాయి. ఇది ధరించడానికి చాలా తేలిక.
మీకు ట్రెడిషనల్ మంగళసూత్రాలు ఇష్టమైతే డబుల్ లాకెట్ ఉన్నది కొనొచ్చు. పండగ దుస్తులకి ఇది బాగుంటుంది.
సింపుల్, క్లాసిక్ లుక్ కోసం ఇలాంటి మంగళసూత్రం తయారు చేయించుకోవచ్చు. రెండు బంగారు సీడ్స్ తో అందమైన పెండెంట్ తయారు చేశారు.