Woman

ఇంట్లో ఇవి ఉంటే ఇక మందులతో పనిలేదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి

వాంతులు

వాంతులు అవుతున్నప్పుడు మీ దగ్గర మందులు లేకపోతే టెన్షన్ పడకండి. లవంగాలను నీళ్లతో మరిగించి తాగితే వాంతులు వెంటనే ఆగిపోతాయి. వీటిలో యాంటీ-ఎమెటిక్ లక్షణాలు ఇందుకు సహాయపడతాయి.

కడుపు నొప్పి

కడుపు నొప్పిని తగ్గించుకోవడానికి మీ దగ్గర మెడిసిన్ లేకపోతే వామును వేయించి కొంచెం నల్ల ఉప్పుతో తినండి. దీంతో కడుపు నొప్పి, వాయువు వెంటనే తగ్గుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

తలతిరగడం

తల తిరుగుడును తగ్గించుకోవడానికి సోంపులో చక్కెరను మిక్స్ చసి తినండి. ఇది మీ ఒంట్లో రక్తప్రసరణను పెంచి, మీ స్టామినాను పెంచుతుంది. తలతిరగడాన్ని తగ్గిస్తుంది. 

విరేచనాలు

విరేచనాలను తగ్గించుకోవడానికి మీ దగ్గర మందులు లేకపోతే అన్నం పెరుగును కలిపి తినండి. ఇది మీ కడుపును చల్లగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

న్యుమోనియా

న్యుమోనియాను తగ్గించుకోవడానికి ఇంగువ నీరు బాగా సహాయపడుతుంది. ఈ వాటర్ శ్లేష్మాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

దంతాల నొప్పి

పంటి నొప్పిని తగ్గించుకోవడానికి ఇంట్లో మందులు లేకపోతే మీరు అల్లం రసాన్ని తాగండి. లేదా దీన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాయండి. ఇది నొప్పిని, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. 

గాయాలు

పిల్లలకు గాయాలు అయినప్పుడు మీ ఇంట్లో ఏ మెడిసిన్ లేకపోతే పసుపు లేదా పసుపు నూనెను వేడి చేయండి రాయండి.ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.

సంక్రాంతికి అదిరిపోయే చీరల కలెక్షన్

గుడ్డు తెల్ల సొన, పచ్చసొన.. ఏది జుట్టు ఊడిపోకుండా చేస్తుందో తెలుసా?

గుడ్డును ఇలా పెడితే ఇక మీ జుట్టు అస్సలు ఊడదు

చలకాలంలో జుట్టుకు హెన్నా ఎలా పెట్టాలో తెలుసా?