Woman
పెళ్లైన ఆడవారు నుదిటిన ఖచ్చితంగా ఎర్రబొట్టును పెట్టుకుంటారు. పెళ్లికి చిహ్నంగా భావిస్తారు. కానీ ఈ బొట్టు పెట్టుకోవడం వెనుక వేరే కారణం ఉంది. అదేంటంటే?
ఎరుపు రంగును హిందూ మతంలో ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ కలర్ మాతృ శక్తికి చిహ్నం కూడా. అందుకే సనాతన ధర్మంలో పెళ్లి తర్వాత ఆడవాళ్లు ఎర్ర బొట్టును పెట్టుకునే సంప్రదాయం ప్రారంభమైంది.
అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టమని చెప్తారు. అందుకే అమ్మవారికి ఎర్ర చీర, ఎరుపు గాజులను సమర్పిస్తారు. సూర్యుని నుంచి వెలువడే 5 ప్రాథమిక రంగుల్లో ఎరుపు రంగు ఒకటి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రెడ్ కలర్ కుజ గ్రహానికి సంబంధించినది. కుజుడి స్వభావం ఉగ్రమైనది. ఎర్రబొట్టు పెట్టుకుంటే కుజ గ్రహ శాంతి లభిస్తుంది. దీంతో వైవాహిక జీవితం సుఖమయంగా సాగుతుంది.
మన జీవితంలో సానుకూలతను పెంచడానికి ఎరుపు రంగు సహాయపడుతుంది. సంతోషకరమైన దాంపత్య జీవితానికి ఇది అవసరం. అందుకే ఆడవాళ్లు ఎర్ర బొట్టు పెట్టుకుంటారు.
ఆడవాళ్లు బొట్టు పెట్టుకునే నుదుటి భాగంలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి కావలసిన గుణాలు ఎరుపు రంగులో ఉంటాయట. అందుకే ఆడవాళ్లు ఎర్రబొట్టు పెట్టుకుంటారట.