కళ్లు చెదిరే హంగులతో పీవీ సింధు పెళ్లి.. ఖర్చు ఎంతంటే?
పీవీ సింధు పెళ్లి
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు డిసెంబర్ 22న వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో వివాహం చేసుకోనున్నారు.
ఎక్కడ పెళ్లి?
ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ రాఫెల్స్‌లో సింధు పెళ్లి జరగనుంది.
ప్రముఖుల హాజరు
సినిమా, క్రీడలు, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు కానున్నారు.
మూడు చోట్ల పెళ్లి వేడుకలు
ఉదయ్‌పూర్‌లోని మూడు చారిత్రక ప్రదేశాలైన లీలా ప్యాలెస్, జగ్ మందిర్, జీల్ మహల్‌లలో పెళ్లి వేడుకలు జరుగుతాయి.
పడవలో అతిథులు
రాజస్థానీ శైలిలో పెళ్లి వేదికను అలంకరించారు. అతిథులను పడవలో పెళ్లి వేదికకు తీసుకెళ్తారు.
లక్షల్లో హోటల్ అద్దె
రాఫెల్స్ హోటల్‌లో 101 గదులు ఉన్నాయి. ఒక రూమ్ రాత్రి బసకు 50 వేల నుండి 1 లక్ష ఉంటుంది. రెండు సూట్‌ల అద్దె 1,44,000 రూపాయలు. మొత్తంగా ఇతర ఏర్పాట్లతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
పీఎం మోడీకి ఆహ్వానం
పీవీ సింధు తన పెళ్లికి ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను ఆహ్వానించారు.