Spiritual
మహాభారతంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వీటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మహాభారతానికి 18 సంఖ్యతో ప్రత్యేక సంబంధం ఉంది.
మహాభారతంలో 18 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని పర్వాలు అంటారు. ఈ 18 అధ్యాయాలలో ఆది పర్వం, సభా పర్వం, విరాట పర్వం ముఖ్యమైనవి.
మహాభారతంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం మధ్య యుద్ధం జరిగింది.
శ్రీమద్భగవద్గీత కూడా మహాభారతంలో ఒక భాగం. గీతలో కూడా మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి.
పాండవ-కౌర సైన్యం మధ్య జరిగిన భారత యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరిగింది.
18 రోజుల పాటు జరిగిన మహాభారత యుద్ధం తర్వాత 18 మంది యోధులు మాత్రమే బతికారు.