జనవరి 14వ తేదీన దేశవ్యాప్తంగా సంక్రాంతి పండగ జరుపుకుంటారు. అయితే, ఈ రోజున 5 పనులు చేయకూడదు. ఈ పనులు చేస్తే కష్టాలు వస్తాయట. మరి, అవేంటో చూద్దాం..
మద్యం సేవించడం..
హిందూ మతంలో మకర సంక్రాంతిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు మద్యం వంటి మాదక ద్రవ్యాలను సేవించకూడదు. అలా చేస్తే చెడు ఫలితాలను అనుభవించాల్సి రావచ్చు.
మాంసాహారం తినకండి
జ్యోతిషశాస్త్రంలో మకర సంక్రాంతిని ఒక పండుగగా చెబుతారు. ధార్మిక దృష్టితో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, కాబట్టి ఈ రోజు మాంసాహారం తినకూడదు.
ఎవరినీ వట్టి చేతులతో పంపకండి
మకర సంక్రాంతి నాడు దానం చేయడం చాలా ముఖ్యం. దీని వల్ల పాప కర్మలు నశిస్తాయి. కాబట్టి ఈ రోజు ఎవరైనా మీ దగ్గర ఏదైనా అడిగితే వారిని వట్టి చేతులతో పంపకూడదు.
బ్రహ్మచర్యం పాటించండి
ధర్మ గ్రంథాలలో కొన్ని ప్రత్యేక తేదీలలో బ్రహ్మచర్యం పాటించాలి. మకర సంక్రాంతి కూడా వాటిలో ఒకటి. కాబట్టి ఈ రోజు భార్యాభర్తలు సంయమనంతో ఉండాలి.
ఎవరి మీదా కోపం, బాధ కలిగించకండి
మకర సంక్రాంతి శుభ దినం, ఈ రోజు ఎవరి మీదా కోపం తెచ్చుకోకూడదు, ఎవరినీ బాధ పెట్టకూడదు. అలా చేయడం మంచిది కాదు, దాని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.