Relations
ఏ విషయం గురించైనా మీ మామ తన అభిప్రాయాన్ని చెబితే.. మీ ఆలోచనా విధానం చాలా పాతది అని కోడలు అస్సలు అనకూడదు. ఎందుకంటే ఇవి మీ మామని బాధపడతాయి. ఇది వారి వయసును, అనుభవాన్ని అగౌరవపరచడమే.
మీకు ఏం తెలియదు అనే మాటను కూడా కోడలు తన మామని అనకూడదు. ఇలా అంటే మీరు వారి జీవిత అనుభవాన్ని, జ్ఞానాన్ని అగౌరవపరచడమే అవుతుంది. ఇవి వారి మనసును ఎంతో బాధపెడుతుంది.
భర్త చేసే చెడు పనులకు మామగారిని నిందిస్తుంటారు చాలా మంది. ముఖ్యంగా కోడండ్లు తండ్రుల పెంపకం మీద ప్రశ్నలు వస్తుంటారు. కానీ ఇది పెద్దవారిని బాధపెడుతుంది. ఇలా అస్సలు చేయకండి.
కోడుకూ, కోడలు గొడవ పడుతుంటే తల్లిదండ్రులు దాన్ని ఆపడానికి మధ్యలోకి రావడం చాలా కామన్. కానీ ఇది నా ఇల్లు మధ్యలో మీరు మాట్లాడకండి అని అనేస్తుంటారు. కానీ ఇది గొడవలకు దారితీస్తుంది.
ఇది బాగాలేదని కొంతమంది డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు. కానీ మామగారితో కోడలు ఇలా అస్సలు చెప్పకూడదు. నచ్చకపోతే మర్యాదగా చెప్పండి.
తండ్రీ కొడుకులు ఎన్నో అనుకుంటారు.ఒక్కటి అవుతారు. కానీ వీరి మధ్యలో కోడలు వెళ్లి నాభర్తను ఏం అనకండి అని మాత్రం అనకూడదు. వారి మధ్య మీ జోక్యం పనికి రాదు. మామ మాటలకు గౌరవం ఇవ్వండి.
పుట్టింటిని, అత్తాగారింటిని పోలుస్తూ అవమానించడం మంచి పద్దతి కాదు. ఇది మీ బంధాలు బీటలు వారేలా చేస్తుంది. కాబట్టి రెండు కుటుంబాలను గౌరవించడం నేర్చుకోండి.